దంపతుల నయా దందా…
అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు
దిశ దశ, కరీంనగర్:
వ్యాపారాల్లో లాభం చేకూరలేదు. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అవసరాలు తీర్చుకోవాలంటే ఏదో మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఆ దంపతులు ఏం చేశారంటే…
సోషల్ మీడియా…
మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు
సోషల్ మీడియా వేదికగా డబ్బు సంపాదించుకునేందుకు ఎంచుకున్న తీరు సంచలనంగా మారింది. రెండేళ్లుగా కరీంనగర్ సమీపంలోని ఆరెపల్లిలో నివాసం ఉంటున్న దంపతులు మొదట మార్బుల్ స్టోన్స్ వ్యాపారం చేసి దివాళా తీశారు. ఆ తర్వాత ఇంటీరియర్ డెకోరేషన్ కు సంబంధించిన వ్యాపారం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇన్ స్టా వేదికగా సరికొత్త దందాకు తెరలేపారు.
వలపు వల…
హనీట్రాప్ దందాను మరిపించే విధంగా వ్యవహరించారు ఈ కపుల్స్. సోషల్ మీడియా వేదికగా సెక్స్ ఇమేజెస్ పోస్ట్ చేస్తూ వలపులు ఒలకబోయడం మొదలు పెట్టారు. తమ ట్రాప్ లో చిక్కుకున్న వారిని తమ వద్దకు పిలిపించుకుని శృంగారం అందించే వారు. సెక్స్ కోసం తహతహలాడే వారంతా ఈ దంపతులు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్ ద్వారా టచ్ లోకి వెళ్లే వారు. తమవద్దకు వచ్చిన విటులతో కలిసి భార్య శృంగారం పంచేది.
ట్విస్ట్ ఇక్కడే…
సెక్స్ కోర్కెలు తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతూ వెళ్లే విటులు వారి ఊహాల్లోకాల్లో వారు తేలియాడుతుంటే… ఆమె భర్త వారు ఎంజాయ్ చేస్తుండగా వీడియోలు తీసేవాడు. ఆ తర్వాత విటులను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. తాము అడిగిన డబ్బులు ఇవ్వనట్టయితే ఆ వీడియోలు విటుల కుటుంబ సభ్యులకు పంపిస్తామనో… సోషల్ మీడియాలో వైరల్ చేస్తామనో బెదిరింపులకు గురి చేసే వారు. దీంతో చేసేదేమి లేక విటులు దంపతులు డిమాండ్ చేసినంత ముట్టచెప్పేవారు. ఆరెపల్లిలోని శ్రీసాయి నివాస అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ లో అవాసం ఏర్పాటు చేసుకున్న దంపతులు ఈ దందా కొనసాగిస్తున్నారు.
బాధితుని ఫిర్యాదు…
సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ తతంగంలో బలైన ఓ బాధితుడు దంపతుల వేధింపులు తట్టుకోలేక కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించడడంతో దంపతుల బండారం బట్టబయలు అయింది. ఇటీవల రూ. నాలుగు లక్షలు ఇవ్వాలని బెదిరించగావారికి చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. చివరకు అతన్ని పట్టుకుని బెదిరింపంలకు గురి చేయగా రూ. లక్ష సమర్పించుకున్నాడు. మిగతా డబ్బులు కూడా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. చివరకు తమను ఆశ్రయించడంతో వీరిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.విటుల నుండి వసూలు చేసిన నగదుతో ఫ్లాట్ EMI చెల్లించడంతో పాటు ఒక టాటా కారు కొనుగోలు చేశారు. ఫ్లాట్ లో ఏసీలు, సోఫా సెట్లు, బెడ్స్ తో పాటు విలువైన వస్తువులు కొనుగోలు చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల నుండి విటులకు సంబంధించిన సెక్స్ వీడియోలు కూడా స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసిన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి టీమ్ ను ఏసీపీ విజయ్ కుమార్ అబినందించారు.