కరీంనర్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత… లాఠీ ఛార్జ్…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ సివిల్ ఆసుపత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయంలో నెలకొన్న గొడవ కాస్తా రాళ్లు రువ్వుకునే వరకు చేరడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… నగరంలోని చంద్రపురి కాలనీకి చెందిన స్వామి అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణానికి ముందు తన బంధువులకు వీడియో కాల్ చేసిన స్వామి తన గోడును వెల్లబోసుకున్నాడు. అయితే సోమవారం కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో స్వామి మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన తరువాత ఇరు కుటుంబాలకు చెందిన వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో రాళ్లు రువ్వుకున్నారు. ఇరు పక్షాలను నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ గొడవ అదుపులోకి రాకపోవడంతో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జీ చేయడంతో పరిస్థితి సద్దు మణిగింది.

crimecrime newskarimnagar newstelangana news