సీఎస్ డీపీతోనూ ఫేక్ కాల్స్… సైబర్ క్రిమినల్స్ దుస్సాహసం…

సైబర్ నేరగాళ్లు వ్యవహరిస్తున్న తీరుకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఫేక్ కాల్స్ చేస్తూ వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్న అగంతకులు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డీపీతో ఫేక్ కాల్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. +977-984-4013103 నెంబర్ ద్వారా నకిలీ కాల్స్ చేస్తున్నారని సీఎస్ ఆ ఫిర్యాదులో వివరించారు. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఎఫ్ఆర్ నంబర్ 4/2024లో కేసు నమోదు అయింది.

crimecrime newscs shanthi kumariCyber crimetelangana news