శ్రీధర్ బాబు పీఏ ఫిర్యాదు… కేసు నమోదు…

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రైవేట్ పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తోట సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పేర్కొన్నారు. ఈ మేరకు సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. BNS ACT 352, 353, 66-E, 67ITA-2000-2008 సెక్షన్లలో ఈ కేసు బుక్ చేశారు. ఫేస్ బుక్ అకౌంట్స్ నవయువ తెలంగాణ, బీజేపీ యువలో మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు, పీఏ సతీష్ ఫోటోలు వేసి కమిషనర్ కార్యాలయంలో శ్రీనుబాబు అరుస్తూ అతని కాలర్ పట్టుకున్నారని షేర్ చేశారని, ఈ పోస్టులో సీనియర్ పోలీసు అధికారి ఫోటోను కూడా అప్ లోడ్ చేశారని సతీష్ తన పిర్యాదులో పేర్కొన్నారు. అవినీతి, ఆరోపణలకు సంబంధించిన కంటెంట్ పోస్ట్ చేసిన ఫేస్ బుక్ అకౌంట్లకు సంబంధించిన లింక్స్ కూడా తన ఫిర్యాదులో వివరించారు. నకిలీ కంటెంట్ కు సంబంధించిన పోస్టు మదన్న వాట్సప్ గ్రూపుల్లో కూడా షేర్ చేశారని, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్), టెలిగ్రాంతో పాటు ఇతర సోషల్ మీడియా, ఎలక్ట్రానికి మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేశారని సతీష్ తన ఫిర్యాదులో వివరించారు. అభ్యంతరకరమైన ఈ పోస్టు వల్ల మంత్రి శ్రీధర్ బాబు అనుయరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని, శాంతి భద్రతలను రెచ్చగెట్టేవిధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టులో తాను రూ. 50 కోట్ల వరకు అక్రమంగా డబ్బు వసూలు చేశానని పేర్కొంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆయా సోషట్ మీడియా వేదికలుగా చేసిన ఈ ప్రచారం అంతా వట్టిదేనని ఇలాంటి సంఘటన జరగలేదని, తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్రచారానికి సంబంధించిన అంశంపై FIR జారీ చేయలేదని, శాఖపరమైన విచారణ కూడా జరగలేదని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఏవీ లేకున్నప్పటికీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తోట సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు. పరువుకు భంగం కల్గించే విధంగా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అభ్యర్థించారు. సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. మూడు రోజుల క్రితం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో బుక్ అయిన ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

crime newsDUDDILLA SRIDHAR BABULatest Newstelangana newsTG NEWS