మంత్రి అడ్లూరితో ఎవరో మాట్లాడిస్తున్నారు: మంత్రి గడ్డం వివేక్…

మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు

దిశ దశ, నిజామాబాద్:

సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలపై మరో మంత్రి గడ్డం వివేక్ స్పందించారు. ఆదివారం నిజామాబాద్ లో జరిగిన మాలల ఐక్యత సభలో వివేక్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ‘‘దున్నపోతు’’ వ్యాఖ్యలు సద్దుమణిగిన తరువాత మంత్రుల మధ్య సయోధ్య కుదిరిందని భావించారంతా. కానీ తాజాగా వివేక్ కౌంట్ అటాక్ చేయడంతో ఆనాటి రచ్చ ఇంకా కొనసాగుతున్నట్టుగానే అనిపిస్తోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరిలతో పీసీసీ చీఫ్ భేటీ అయి ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు. అయితే ఆనాటి కార్యక్రమంలో ఉన్న మరో సహచర మంత్రి గడ్డం వివేక్ కూడా తప పట్ల వివక్ష చూపారని అడ్లూరి కామెంట్ చేశారు. తాను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే వివేక్ తనను వివక్ష చూపుతున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే తాజాగా వివేక్ అడ్లూరి కామెంట్స్ పై స్పందించిన తీరు సరికొత్త చర్చకు దారి తీసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇంఛార్జిగా ఉన్నపై ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని అడ్లూరికి ఎవరో నూరి పోస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు సమావేశంలో తాను మొబైల్ చూస్తున్నానని ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోలేదని, ఆ తరువాత జరిగిన మరో సమావేశంలో ఇద్దరం కలిసి పాల్గొన్నామని వివేక్ వివరించారు. ఆ సభలో కూడా అడ్లూరి గురించి తాను ప్రస్తావిస్తూ బాగానే పని చేస్తున్నాడని చెప్పాను తప్ప ఆయన గురించి వివక్ష చూపలేదన్నారు. అయితే తనను లక్ష్యం చేసుకుని అడ్లూరి ఇలా మాట్లాడడం సరికాదని, తన తండ్రి వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారన్నారు. తనపై మాట్లాడినప్పుడు వివేక్ ఎందుకు స్పందించలేదన్నారని అయితే జూబ్లీహిల్స్ లో 12 శాతం వ్యతిరేకత ఉండగా తాను ఇంఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తరువాత 5 శాతం అనుకూలత ఏర్పడిందన్నారు. దీంతో తనకు మంచి పేరు వస్తుందని చూసి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని మంత్రి వివేక్ ప్రశ్నించారు.

అప్పుడెలా..?

వెంకటస్వామి జన్మదిన సందర్భంగా అధికారికంగా కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి జీఓ జారీ చేశారన్నారు. కల్చరల్ డిపార్ట్ మెంట్ ద్వారా ముద్రించిన కార్డులో తాను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే తన పేరు పెట్టలేదని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా చేసిందని అప్పుడు ముద్రించిన కార్డులో కూడా ఎవరి పేర్లు పెట్టలేదని ఈ విషయంపై మాత్రం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శలు చేయలేదన్నారు. తాను మాల జాతికి చెందిన వాడినని విమర్శంచడం సరికాదన్నారు. మాల, మాదిగ అంశాన్ని వాడుకుని గొడవలు పెట్టుకోవద్దని మంత్రి వివేక్ కోరారు.

ADLURI LAXMAN KUMARDUDILLA SRIDHAR BABUgaddam vivekTELANGANA CONGRESSTG NEWS