కోరుట్ల బీఆర్ఎస్ పార్టీలో కలకలం… పార్టీ వీడనున్న సీనియర్ నేత…

నేడో రేపో బీజేపీలోకి…

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లా రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేవనుందా..? కీలక ఉద్యమ నేత గులాభి పార్టీని వదిలేసేందుకు రంగం సిద్దమైందా..? అంటే అవుననే చర్చ సాగుతోంది జిల్లా వ్యాప్తంగా. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేను దూరం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ నుండి మరో ముఖ్య నాయకుడు కూడా ఇతర పార్టీల వైపు అడుగులు వేస్తుండడం తీరని నష్టాన్ని చేకూర్చే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కోరుట్ల…

కోరుట్ల నుండి బీఆర్ఎస్ పార్టీలో రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న డాక్టర్ అనూప్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతున్నప్పటికీ తనకు ప్రాధాన్యత కల్పించకపోవడం, స్థానికంగా ఒకే కుటుంబానికి చెందిన వారికే అవకాశాలు అందివస్తుండడం పట్ల ఓ వర్గంలో అయితే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. డాక్టర్ అనూప్ రావు లాంటి సీనియర్లు కూడా సమిధలుగా మిగిలిపోయామే తప్ప పార్టీలో నామమాత్రంగా కూడా గుర్తింపు లేకుండా పోయిందన్న ఆవేదన కనిపిస్తోంది. దీంతో తమ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని భావించినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉద్యమ ప్రస్థానం నుండి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన తాము వివక్షకు గురి కావడం వల్ల అన్నింటా నష్టపోయామన్న అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. కోరుట్ల ప్రాంతంలో ప్రభావిత చేయగలిగే సత్తా ఉన్న నాయకుల్లో ఒకరైన డాక్టర్ అనూప్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.

బీజేపీలోకి…

డాక్టర్ అనూప్ రావు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కూడా మంతనాలు జరిపిన ఆయన కాషాయం కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. డాక్టర్ అనూప్ రావు బీజేపీలో చేరినట్టయితే కీలక బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో బీజేపీ నాయకత్వం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో డాక్టర్ అనూప్ రావ్ బీజేపీలో చేరడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఆయన పార్టీలో ఎప్పుడు  చేరుతారోనన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది.

BRS NEWSflash newsJAGITIAL NEWSkorutlaTG NEWS
Comments (0)
Add Comment