vemulawada temple: వేములవాడ ఆలయంలో సంచలనం…

నకిలీ సర్టిఫికెట్ తో పదోన్నతి…

కేసు నమోదు చేసిన పోలీసులు

దిశ దశ, వేములవాడ:

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో సంచలన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పదోన్నతి పొందేందుకు ఆలయ ఉద్యోగి ఒకరు ఇచ్చిన సర్టిఫికెట్ నకిలీదని తేలడంతో క్రిమినల్ కేసు నమోదు అయింది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ గత డిసెంబర్ 12న జారీ చేసిన మెమో ఆధారంగా వేములవాడ ఆలయ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆలయ ఉద్యోగి, ప్రస్తుతం యాదగిరి గుట్ట నర్సింహస్వామి ఆలయంలో పని చేస్తున్న సంకెపల్లి హరి కిషన్ పై వేములవాడ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (AEO)గా పని చేస్తున్న ఆయన పదోన్నతి సమయంలో డిగ్రీ సర్టిఫికెట్ ను దేవాదాయ శాఖ అధికారులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు D.G.G.A (V&E) తెలంగాణ విజిలెన్స్ విభాగం రిపోర్ట్ నం: 14 C.NO. 919/V&E/D1/2023 & 686/V&E/D1/2024/D.t. 19.07.2024 నివేదిక అందడంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అదికారులు నిర్ణయించారు. దర్బంగాలోని లలిత్ నారాయణ్ మహిళా యూనివర్శిటీ నుండి బోగస్ సర్టిఫికెట్ తీసుకున్నట్టుగా క్రియేట్ చేశారని, ఈ సర్టిఫికెట్ గురించి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కూడా లేఖ రాసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. దీంతో హరికిషన్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఇంకా ఎందరో..?

గతంలో కూడా వేమువాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసి పదోన్నతి పొందినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. రాజన్న ఆలయంలో డ్యూటీలో ఉన్న సమయంలోనే వారు పరీక్షలకు హాజరయి టెక్నికల్ ఎడ్యూకేషన్ పూర్తి చేసినట్టుగా సర్టిఫికెట్లు సమర్పించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో అప్పటి దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకునేందుకు మీనామేషాలు లెక్కించారన్న విమర్శలు కూడా వినిపించాయి. గతంలో జరిగిన ఘటనలు, తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాన్ని గమనించినట్టయితే  దేవాదాయ శాఖలో బోగస్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి పదోన్నతులు పొందిన వారు మరికొంత మంది ఉండి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Latest Newsrajanna sircillarajanna templesri raja rajeshwara templevemulawada