మాధవి లతను కౌగిలించుకున్న ఫలితం… ఏఎస్ఐ సస్పెన్షన్…

దిశ దశ, హైదరాబాద్:

హైదరాబాద్ బీజేపీ నాయకులకు వరస షాకులిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఎంపీ క్యాండెట్ మాధవి లతతో పాటు ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసులు నమోదు చేయగా తాజాగా ఓ ఏఎస్ఐని సస్పెండ్ చేశారు. ఓ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెల్లిన మాధవి లత వద్దకు వెల్లిన సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ పోలీసు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరామ నవమి సందర్బంగా నిర్వహించిన ర్యాలీలో మాధవి లత విల్లుతో మసీదుకు ఎక్కుపెట్టినట్టుగా ఓ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై మాధవిలతపై ఆదివారం కేసు నమోదు చేశారు. తాజాగా ఆమెను కౌగిలించుకున్నందుకు మహిళా ఏఎస్ఐని సస్పెండ్ చేశారు.

2024 Electionsbandi sanjay kumarBJP TELANGANAKOMPALLA MADHAVI LATHAmla rajasingh