యాజమాన్యం ఎత్తులకు కార్మికుల పై ఎత్తులు..

దిశ దశ, హైదరాబాద్:

ప్రభుత్వ ప్రయత్నాలు గండి కొట్టే విధంగా డిపోల ముందుకు కార్మికులు బైఠాయించి బస్సులను అడ్డుకుంటున్నారు. ప్రైవేట్ డ్రైవర్ల చే బస్సులను నడిపించేలాని చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడుతోంది. హైర్ బస్సు డ్రైవర్లు కొన్ని చోట్ల కార్మికులకు అండగా నిలుస్తుండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వెల్ఫేర్ బోర్డు మెంబర్లు రాజీనామాలకు పూనుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రారంభం అయిన తొలి రోజే రాష్ట్రంలోని వివిధ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వెల్ఫేర్ బోర్డు సభ్యులు…

కార్మికుల సంక్షేమం కోసం ఆర్టీసీ డిపోల వారిగా ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు సభ్యల విధానాన్ని అమలు చేస్తోంది. ప్రతి డిపోకు కార్మికుల పక్షాణ ఇద్దరిని సభ్యులుగా నియమించుకునే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు అందుకున్న వెల్ఫేర్ బోర్డు సభ్యులు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. తమ బాధ్యతలకు రాజీనామా చేసి సమ్మెలో భాగస్వాములు అవుతున్నారు. సిద్దిపేట డిపోనకు చెందిన బోర్డు సభ్యులు ఎం ఎల్లయ్య, టి హేమలతను తమ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. మంచిర్యాల డిపోలో కార్మికుల సమ్మె నేపథ్యంలో నిరసనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో హైర్ బస్సులను నడిపించాలని డ్రైవర్లకు ప్రతిపాదించగా వారు కండక్టర్లు లేకుండా నడిపించమని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి హైర్ బస్సు డ్రైవర్లపై చేయి చేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మంచిర్యాలలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేములవాడ, సిద్దిపేటలతో పాటు పలు ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు బైఠాయించారు. దీంతో బస్సులు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

ఫ్రీ సర్వీస్…

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఉచితంగా నడిపించాలన్న ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కార్మికులంతా సమ్మెలోకి వెళ్లడంతో ప్రతి ప్రయాణీకుడిని ఉచితంగా గమ్యం చేర్చాలన్న ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కొన్ని డిపోలలో ప్రైవేట్ డ్రైవర్లచే ఉచిత సర్వీసులు నడిపించేందుకు రంగంలోకి దిగినట్టుగా సమాచారం.

ప్రమాదం…

ప్రైవేటు డ్రైవర్లచే కొన్నిడిపోల్లో బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రయాణీకులతో వెళ్లిన కరీంనగర్ డిపో బస్సు బైపాస్ రోడ్డు సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రైవేట్ డ్రైవర్ నడిపిస్తున్న ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రైవేట్ డ్రైవర్లచే ఆర్టీసీ బస్సులను నడిపించడం ప్రమాదకరమేనని స్పష్టం అయిపోయింది.

మహలక్మీని మోస్తున్నాం: కండక్టర్ సుజాత

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మహాలక్షీ పథకాన్ని తమ భుజాలపై వేసుకుని మోస్తున్నామని భైంసా డిపోనకు చెందిన కండక్టర్ సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంగా ఇవ్వాల్సిన పీఆర్సీ మంజూరు చేయాలని మాత్రమే అడుగుతున్నామని, మహాలక్ష్మీ పథకంలో ఉచిత టికెట్ ఇచ్చినా డబ్బులు తీసుకున్నా సస్పెండ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహాలక్ష్మ వల్ల తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, తమ ఆకలి పోరాటాన్ని గమనించి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని సుజాత అభ్యర్థించారు. అలాగే ఆర్టీసీలో యూనియన్లను పునరుద్దరించాలని కోరిన ఆమె తమ కుటుంబానికి చెందిన ఆత్మ బంధువు చనిపోతే ఒక్క రోజు సెలవు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. శవంతో సహా ఫోటో షేర్ చేస్తేనే లీవ్ సాంక్షన్ చేస్తామని యాజమాన్యం చెప్తోందన్నారు. యునియన్లు ఉన్నట్టయితే నాయకులకు తమ గోడు చెప్పుకునే అవకాశం ఉంటుందన్నారు.

Latest NewsProtests in RTC...RTC JACRTC strikeTG NEWS
Comments (0)
Add Comment