దిశ దశ, దుర్శేడ్:
అందుబాటులో పోలీంగ్ బూత్ లలో ఓటు వేసే విధంగా చొరవ తీసుకోవడంలో అధికారులు విఫలం అయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. పోలీంగ్ బూత్ సమీపంలో ఉన్నా సూదూర ప్రాంతంలోని కేంద్రంలో ఓటు వేసే విధంగా నిర్ణయించడం విస్మయం వ్యక్తం అవుతోంది. మునిసిపల్ ఎన్నికల్లో అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఒక్క దుర్శేడ్, గోపాల్ పూర్ డివిజన్లను గమనిస్తే… ఇక్కడి కొందరి ఓటర్లు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోలీంగ్ బూత్ లో తమ ఓటు హక్కు వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు పంచాయితీలుగా ఉన్న దుర్శేడు, గోపాల్ పూర్ గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనం చేశారు. 4, 5 డివిజన్లుగా గుర్తించిన అధికారులు పోలింగ్ బూత్ లను అలాట్ చేసే విషయంలో ఓటర్ల ఇబ్బందులను గమనించలేదన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. గతంలో గోపాల్ పూర్ ఓటర్లు గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండేది. కానీ మునిసిపల్ ఎన్నికల్లో మాత్రం 2 కిలో మీటర్ల దూరంలో దుర్శఏడ్ జడ్పీ హైస్కూల్ పోలీంగ్ కేంద్రానికి వెల్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ సమీపంలోని శ్రీపురం కాలనీ నుండి దుర్శేడ్ వరకు 5వ డివిజన్ గా గుర్తించగా, దుర్శేడు ఓటర్లు మాత్రం ఓటు వేయాలంటే రజ్వీ చమన్ లోని ఐక్యూర జేమ్స్ ఇంటర్నేషనల్ పాఠశాల పోలింగ్ కు చేరుకోవాలి. దుర్శేడులోని దాదాపు 500 ఓటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రజ్వీ చమన్ పోలింగ్ కేంద్రానికి చేరుకోవల్సి ఉంటుంది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్ లో కేంద్రం ఉన్నప్పటికీ రజ్వీ చమన్ పరిధిలోకి చేర్చడం వల్ల ఓటర్లకు ఇబ్బందులు తప్పవు. వృద్దులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధ పడుతున్న ఓటర్లు అల్లంత దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతున్న విషయాన్ని అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది.
మార్చండి…
గోపాల్ పూర్, దుర్శేడ్ ఓటర్లు అల్లంత దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెల్లిరావడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను గమనించి సమీపంలోని పోలింగ్ బూత్ ల్లో ఓట్లు వేసే విధంగా చొరవ తీసుకోవాలని దుర్శేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, నేరెళ్ల శ్రీనివాస్ లు మునిసిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇతర ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఓటు వేసే విధంగా ప్రతిపాదనలు తయారు చేయడం సరికాదని దీనివల్ల ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓటర్లు అనాసక్తితో దూరంలో ఉన్న బూత్ లకు వెల్లి ఓట్లు వేసే పరిస్థితి ఉండదని వారు వివరించారు.