చొప్పదండిని తాకిన పిఠాపురం కల్చర్…

 

దిశ దశ, చొప్పదండి:

ఎన్నికల ఫలితాలకు ముందు ఏపీలోని పిఠాపురంలో యూత్ పవన్ కళ్యాణ్ పై ఉన్న క్రేజీని ప్రదర్శించేందుకు వెనకాడలేదు. పోలింగ్ పూర్తయిన తరువాత తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ రాయించుకున్నారు పవర్ స్టార్ అభిమానులు. పిఠాపురంలో తమ బైకులపై అభిమానులు ఇలా రాయించుకున్న విషయంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పిఠాపురం అభిమానుల ప్రదర్శన ప్రభావం తెలంగాణాకు కూడా పాకింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అభిమాని ఒకరు తన బైక్ నంబరు ప్లేటుపై మేడిపల్లి సత్యం, చొప్పదండి ఎమ్మెల్యే తాలుకా అంటూ రాయించుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన నక్క అనిల్ తన వాహనం నంబర్ ప్లేట్ పై ఇలా రాయించుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలోని పిఠాపురంలో కొనసాగిన ట్రెండ్ ప్రస్తుతం తెలంగాణాలోని చొప్పదండికి పాకిందంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

choppadandi mlakarimnagar newsMEDIPALLY SATHYAM MLAPawan Kalyantelangana news