దిశ దశ, వరంగల్:
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఖాజీపేట రైల్వే కోర్టు. మొదట జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ… కోర్టు ముందు కౌశిక్ రెడ్డి తరుపున న్యాయవాదులు వినిపించిన వాదనలకు అనుకూలంగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై హై కోర్టులో విచారణ పెండింగులో ఉన్నదన్న కారణంతో పాటు ఎఫ్ఐఆర్ లో లేని 308(5) సెక్షన్ ను రిమాండ్ షీట్ లో చేర్చారని కూడా ఆయన తరుపు న్యాయవాదులు మెజిస్ట్రేట్ కు వినిపించారు. దీంతో ఆయనకు కండిషన్ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు జైలుకు తరలించకుండా కోర్టు ఆదేశాలను పాటించాల్సి వచ్చింది.