దిశ దశ, కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముగ్గురు మంత్రులు తమ ఇలాకాలో సత్తా చాటుకున్నారు. తమ నియోజకవర్గాల్లోని మునిసిపాలిటీలను కైవసం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపించినప్పటికీ ఉమ్మడి జిల్లా మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న చోట మాత్రం గులాభి పార్టీ నామమాత్రపు ఫలితాలను అందుకుంది.
దుద్దిళ్ల…
మంథని మునిసిపాలిటీలో 13 వార్డుల్లో 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తుందన్న ఉహాగానాలకు తెరదించుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తన అనుచరులను గెలిపించుకోవడంలో సఫలం అయ్యారు. అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచార వరకూ ఆయన మంథని మునిసిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించడంతో తిరుగులేని అధిక్యతను సాధించుకోగలిగారు.
పొన్నం…
హుస్నాబాద్ మునిసిపాలిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ తన మార్క్ ఫలితాలను సాధించుకున్నారు. 20 వార్డుల్లో 16 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా బీఆర్ఎస్ పార్టీ నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది.
అడ్లూరి…
ధర్మపురి మునిసిపాలిటీపై తిరుగులేని ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ సాధించింది. 15 వార్డుల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం గమనార్హం. ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ఖాతా తెరవలేకపోయింది.