Telangana: జిల్లా కలెక్టర్ పై మంత్రి పొంగులేటి అసహనం…

దిశ దశ, కరీంనగర్:

కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనలో రాష్ట్ర మంత్రికి కోపం వచ్చింది. కరీంనగర్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటున్న క్రమంలో ఓ చోట కలెక్టర్ పై తన అసహనాన్ని ప్రదర్శించారు మంత్రి. శుక్రవారం కరీంనగర్ లోని కుమార్ వాడి స్కూల్ లో మంత్రి తన పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై తన అసహనాన్ని ప్రదర్శించారు. ‘‘వాట్ ఈజ్ దిస్’’ అంటూ కలెక్టర్ వైపు చూస్తూ ప్రశ్నించారు. అక్కడ ఎదురైన పరిస్థితులను గమనించిన మంత్రి తన కోపాన్ని ప్రదర్శించినట్టుగా అర్థం అవుతోంది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా కలెక్టర్ పమేలా సత్పతి కూడా వివరించే ప్రయత్నం చేసినట్టుగా స్ఫష్టం అవుతోంది. అయితే ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పర్యటన సందర్బంగా పోలీసులు పదే పదే తోసి వేస్తున్నట్టుగా వ్యవహరించడంతో ఆయన కలెక్టర్ పై కోపం ప్రదర్శించారని అక్కడున్న వారు చెప్తున్నారు. మంత్రి పొంగులేటి విషయంలో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరువల్లే ఆయన తన అసహానాన్ని వ్యక్తం చేశారని అర్థం అవుతోంది.


bandi sanjaykarimnagarPamela Satpathy iasponguleti srinivas reddytelangana news