దిశ దశ, కరీంనగర్:
జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14న అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్ష నిర్వహించనున్నామని అల్ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మన్ వి నరేందర్ రెడ్డి వెల్లడించారు. శనివారం కరీంనగర్ లో “అమాట్-2025” పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… రామానుజన్ స్మృతిలో తెలంగాణలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో 3వ తరగతి నుండి 10వ తరగతి సీబీఎస్ఈ, స్టేట్, ఐసీఎస్ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. ‘‘అమాట్’’ పరీక్షల నిర్వహాణ వల్ల విద్యార్థులకు స్పూర్తి దాయకంగా నిలుస్తుందని, ఈ నెల 14న ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. 100 మార్కుల ఈ పరీక్షలో సరైన జవాబుకు 4 మార్కులు, తప్పు జవాబుకు 1 మార్కు ఉంటుందని, ప్రతి తరగతిలో మొదటి 20 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రంతో పాటు బహుమతులు అందజేస్తామన్నారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ. 5, 3, 2 వేల చొప్పున నగదు పారితోషికంతో పాటు జ్ఞాపికలు అందజేస్తామని నరేందర్ రెడ్డి వివరించారు. విజేతందరికి ఈ నెలల 22న రామానుజన్ జయంతోత్సవాలు, గణిత దినోత్సవాల సందర్భంగా పురస్కారాలు అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతిభ కలిగిన విద్యార్థులంతా వినియోగించుకుని సక్సెస్ కావాలని అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆసక్తి కలిగిన విద్యార్థులను ఈ నెల 12వ తేది లోగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు 92469 34441,92469 34456, 9398230614 నంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.