వేములవాడలో వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి…

దిశ దశ, వేములవాడ:

వేములవాడ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత అనుమానస్పద స్థితిలో మరణించడం స్థానికంగా సంచలనంగా మారింది. మృతురాలి భర్త స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ మాజీ పీఏగా స్థానికులు చెప్తున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్ స్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వెంగల రోహిణి (32) బుధవారం తెల్లవారు జామున అనుమానస్పద స్థితిలో మరణించింది. గత కొంతకాలంగా వైవాహిక బంధంలో వచ్చిన విబేధాల కారణంగానే ఆమె చనిపోయి ఉంటుందని రోహిణి బంధువులు ఆరోపిస్తున్నారు. కథలాపూర్ మండలానికి చెందిన రోహిణిని దినేష్ కు 8 ఏళ్ల క్రితం వివాహం జరిపించగా ఇద్దరు కూతుర్లు కూడా జన్మించారు. కొంతకాలంగా దినేష్ వివాహేతర బంధం ఏర్పర్చుకుని భార్య రోహిణిని వేదింపులకు గురి చేసేవాడని మృతురాలి బంధువులో ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో భార్య భర్తల మధ్య ఈ విషయంలో తరుచూ గొడవలు జరుగుతుండేవని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే బుధవారం తెల్లవారు జామున రోహిణీ ఆత్మహత్య చేసుకుందని పట్టణంలోని ఓ ప్రేవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రోహిణి మెడపై గాయాలై ఉన్నట్టుగా ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ సీఐ వీర ప్రసాద్ విచారణ చేపట్టారు.

రెండు నెలల క్రితమే…

దినేష్ ఆయన భార్య రోహిణీల మధ్య కలహాలు తీవ్ర రూపం దాల్చడం, అతను వివాహేతర బంధం విషయం వెలుగులోకి రావడంతో వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ముందుగానే అప్రమత్తం అయ్యారు. తన వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్న దినేష్ ను రెండు నెలల క్రితమే తొలగించినట్టు సమాచారం.

crimecrime newsLatest Newsrajanna siricilla districtvemulawada
Comments (0)
Add Comment