సేఫ్ జోన్ లో బడే దామోదర్…
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారిగా భావిస్తున్న మావోయిస్టులను కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా పౌర హక్కుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియిస్ దామోదర్ కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులకు పట్టుబడిన వారిలో దామోదర్ లేనట్టుగా వెలుగులోకి వస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న వారితో పాటు ఆయుధాలు కూడా లభ్యమైనట్టుగా సమాచారం. ఇందులో ఒక AK 47 ఆయుధం కూడా ఉండడంతో దామోదర్ కూడా వీరితో పాటు దొరికినట్టుగా అనుమానిస్తున్నారు. అయితే దామోదర్ మాత్రం సేఫ్ జోన్ లోనే ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు అదుపులో చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన 16 మంది మావోయిస్టులు ఉన్నారని తెలుస్తోంది. అయితే తెలంగాణ పోలీసు వర్గాలు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించ లేదు.