ఇసుక రీచుల్లో లోడింగ్ బంద్… ఛార్జీలు ఇవ్వాల్సిందేనని పట్టు…

రెండో రోజూ అదే తంతు…

దిశ దశ, కరీంనగర్:

ఇసుక రీచుల్లో ఛార్జీలు చెల్లిస్తేనే లోడింగ్ చేస్తామని నిర్వాహాకులు తేల్చి చెప్తున్నట్టుగా ఉంది. టీజీఎండీసీకి చెల్లిస్తున్న లోడింగ్ ఛార్జీలతో సంబంధం లేకుండా అదనంగా డబ్బులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కరీంనగర్ జిల్లాలోని కొన్ని రీచుల్లో ఇసుక లోడింగ్ ఎక్కడికక్కడ నిలిచిపోయినట్టుగా సమాచారం.

మూడు చోట్ల…

కరీంనగర్ జిల్లాలోని ఊటూరు, పోతిరెడ్డిపల్లి, చల్లూరు క్వారీలలో ఇసుక లోడింగ్ నిలిపివేసినట్టుగా సమాచారం. గురువారం నుండే ఇసుక లోడింగ్ చేసేది లేదని నిర్వాహకులు తేల్చి చెప్పడంతో ఆయా రీచుల్లో లారీలు బారులు తీరి ఉన్నాయి. లోడింగ్, కాంటా, జేసీబీ, సీరియల్ కోసం ఒక్కో లారీకి రూ. 3 వేలు చెల్లిస్తేనే లోడింగ్ చేస్తామని స్పష్టం చేసినట్టుగా సమాచారం. ఈ విషయంపై టీజీఎండీసీ అధికారులు జోక్యం చేసుకోవల్సిన అవసరం ఉందని లారీ ఓనర్స్ అసోసియేషన్ అంటోంది. ఓ వైపున ఇసుక కొనుగోలు చేసేందుకు తీస్తున్న డీడీలతో పాటు లోడింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని తిరిగి అదనంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం సరికాదని వాపోతున్నారు. అదనంగా చేస్తున్న వసూళ్ల వల్ల తమపై ఆర్థిక భారం పడుతోందని లారీ యజమానులు చెప్తున్నారు.

sandsand lorrysSAND MAFIASAND REACHESTGMDC