కేసీఆర్ ఫ్యామిలీ లెక్క మా ఫ్యామిలీ…

 

మాజీ మంత్రి మల్లారెడ్డి చిట్ ఛాట్

దిశ దశ, హైదరాబాద్:

పార్టీ అధినేత కుటుంబం లెక్కనే మా కుటుంబం ఉండాలనుకుంటున్నాం… అందుకే మా ఇంట్లో కూడా మూడు పదువులు ఉండాలని భావిస్తున్నమని అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. శుక్రవారం మీడియాతో ఆయన చిట్ చాట్ చేసిన సందర్బంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబంలా మా కుటుంబంలో కూడా మూడు ఉండాలని అనుకుంటున్నామన్నారు. రాబయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడుకు భద్రా రెడ్డి మల్కాజ్ గిరి నుండి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నాడన్నారు. అధినేత కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేస్తాడని, ఎంపీ టికెట్ కోసం జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారన్నారు. ఆయన ఫోకస్ అయ్యేందుకు నా పేరు ఎత్తుతున్నాడని, నా పేరు ఎత్తకపోతే ఆయనను ఎవరూ పట్టించుకోరన్నారు. గోవాలో హాటల్ ఉన్నదని, రాజకీయల నుండి తప్పుకుంటే అక్కడికెళ్లి ఎంజాయ్ చేస్తానన్నారు. మనిషి జీవితం ఒకేసారి వస్తుందని ఎంజాయ్ చేయాలని తన మనసులోని మాట బయటపెట్టారు మల్లారెడ్డి.

BRS NEWSc malla reddymalla reddymalla reddy brsTELANGANA POLITCS
Comments (0)
Add Comment