కరీంనగర్ కలెక్టర్ బదిలీ…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ గా బదిలీ కాగా, ఏటూరునాగరాం ఐటీడీఏ పీఓగా పని చేస్తున్న చిత్రా మిశ్రాను కరీంనగర్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. కరీంనగర్ డీఆర్వో వెంకటేశ్వర్లు నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.

ias transfersLatest NewsPAMELA SATPATHI IAStelangana newsTG NEWS
Comments (0)
Add Comment