మేడిగడ్డనను పరిశీలించిన జస్టిస్…

దిశ దశ, మహదేవపూర్:

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్ర ఘోష్ పరిశీలించారు. మంగళవారం మద్యాహ్నం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బ్యారేజీలోని 7వ బ్లాకులో కుంగుబాటుకు గురైన పిల్లర్లను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు జస్టిస్ ఘెష్ కు పిల్లర్లకు సంబంధించిన నిర్మాణం గురించి వివరించడంతో పాటు కుంగిపోయిన తీరు, ఎంత లోతులోకి కుంగింది తదితర వివరాలను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అధికారుల నుండి వివరాలను తెలుసుకున్న జస్టిస్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఎస్ఏ నివేదికను స్టడీ చేయాల్సి ఉందన్నారు. కుంగుబాటుకు కారణాలు, లోపాలకు సంబంధించిన అంశాలపై నిపుణులను అడిగి తెలుసుకోనున్నామన్నారు.

annaramcm revanth reddykaleshwaramKCRmedigadda barrage