ఛైర్మన్ అటు… వైస్ ఇటు… జగిత్యాల అంశంలో కుదిరిన రాజీ..?

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల మునిసిపల్ పాలకవర్గం అంశం ఎట్టకేలకు తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర అగ్ర నాయకత్వం రంగంలోకి దిగి చర్చలు జరపడంతో ఓ కొలిక్కి వచ్చినట్టుగా సమాచారం.

ఛైర్మన్ అటు… వైస్ ఇటు…

మునిసిపల్ ఛైర్మన్ ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి, వైస్ ఛైర్మన్ పదవి మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి ఇచ్చే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులతో పాటు అభివృద్ది పనుల విషయంలో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన వార్డులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఒప్పందం చేస్తామని కూడా సూచించినట్టుగా సమాచారం.

సీఎం… డిప్యూటీ….

సీఎం రేవంత్ రెడ్డి వద్దకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరుకున్నట్టు సమాచారం జగిత్యాల అంశంలో తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. మరో వైపున ప్రగతి భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి, సీనియర్ మంత్రులతో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, కౌన్సిలర్లు భేటీ అయ్యారు. అధిష్టానం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డిల ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది.

కండిషన్స్ అప్లై…

అయితే తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన విషయంపై తానిప్పుడే స్పందించలేనని మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. కౌన్సిలర్లతో చర్చించిన తరువాత నిర్ణయాన్ని వెళ్లడిస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇందుకు సుముఖత వ్యక్తం చేయాలని భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత దక్కే విధంగా చొరవ తీసుకుంటామని డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు చెప్పినట్టుగా సమాచారం. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆదివారం సాయంత్రానికల్లా జగిత్యాల అంశం కొలిక్కి వచ్చేట్టుగానే కనిపిస్తోంది.

2026 elections2026 Municipal ElectionsJAGITIAL NEWSLatest NewsT JEEVAN REDDY
Comments (0)
Add Comment