హుజురాబాద్ మాధవి నర్సింగ్ హోం సీజ్

దిశ దశ, హుజురాబాద్:

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రైవేటు ఆసుపత్రిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కొరడా ఝులిపించారు. నర్సింగ్ హోంను సీజ్ చేస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని మాధవి నర్సింగ్ హోం ను సీజ్ చేస్తున్నట్టు డీఎంహెఎచ్ఓ సుజాత ఆదేశాలు జారీ చేశారు. ఈ నర్సింగ్ హోంలో భ్రూణ హత్యను నిర్దారించిన తరువాతే చర్యలు తీసుకున్నారు. అయితే ఆసుపత్రిని సీజ్ చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ ను కూడా రద్దు చేస్తున్నట్టు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులను ఆసుపత్రి యాజమాన్యానికి అందించారు.  

Abortionabortionshuzurabadkarimnagar newstelangana news