పోలీసుల అదుపులో హోం మంత్రి…

దిశ దశ, హైదరాబాద్:

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన ఆయనను అదుపులోకి తీసుకుని వాహనంలో నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు. జిఓ 29ని రద్దు చేయాలన్న డిమాండ్ తో సచివాలయం ముట్టడికి వెల్తున్న గ్రూప్స్ అభ్యర్థులతో కలిసి వెలుతున్న క్రమంలో కేంద్ర మంత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… ప్రభుత్వం రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయదలుచుకుందా అని ప్రశ్నించారు. మొండి పట్టు వీడాలని హితవు పలికిన ఆయన కోర్టును కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. హై కోర్టు తీర్పును గౌరవించాలని బండి సంజయ్ సూచించారు.

bandi sanjay bjpgo 29group 1Latest Newstelangana news