భారీ వర్షం కారణంగా ఆలయంలోనే… హై కోర్టు జస్టిస్…

దిశ దశ, వరంగల్:

తుపాను ప్రభావం కారణంగా విస్తృతంగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కురవి శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని ఆదివారం హై కోర్టు జస్టిస్ సూరిపల్లి నంద దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుగు ప్రయాణం కావల్సి ఉన్నప్పటికీ భారీ వర్షం కారణంగా ఆలయంలోనే ఆగిపోవల్సి వచ్చింది. వర్షాలతో రహదారులన్ని జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని జస్టిస్ సూరిపల్లి నందకు జిల్లా పోలీసులు సమాచారం ఇచ్చారు. దాదాపు రెండు గంటల పాటు ఆలయ ప్రాంగణంలోనే ఉన్నారు.

floodsheavy rainsKURAVIMahabubabadtelangana news