గోదావరి పుష్కరాలపై స్పషల్ ఫోకస్… క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు…

దిశ దశ, హైదరాబాద్:

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెడుతోంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో భక్తుల కల్సించాల్సిన సౌకర్యాలు, పుష్కరాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుండే కసరత్తులు చేస్తోంది. ఇందు కోసం రాష్ట్ర మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయడంతో ప్రాధాన్యత కల్పించినట్టుగా స్పష్టం అవుతోంది. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ,
దనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వర్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డిలు ప్రాతినిథ్యం వహిస్తారు.

600 కిలో మీటర్లు…

మహారాష్ట్రలోని నాసిక్ త్రియంబకేశ్వర్ నుండి ప్రారంభం అయ్యే ఈ నది నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణాలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 600 కిలో మీటర్ల మేర ప్రవహిస్తున్న గోదావరి నది 8 జిల్లాల మీదుగా సాగనుంది. కొత్తగూడెం భద్రాద్రి జిల్లా మీదుగా ఏపీలోకి ప్రవేశించే గోదావరి నది రాజమండ్రికి దిగువన అంతర్వేది వద్ద సముద్రంలో
కలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన వనరుల్లో గోదావరి నది పాత్ర అత్యంత కీలకం కాగా పరివాహక ప్రాంతంలో వాణిజ్యంతో పాటు వరి సాగు కూడా సాగు చేస్తుంటారు రైతులు. 12 ఏళ్ల కోసారి వచ్చే పుష్కరాలు 2027లో రానున్న సందర్భంగా ఈ సారి ఏర్పాట్లు భారీగా చేయాలన్న యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. 

ప్రత్యేకత…

తెలంగాణలో ప్రవహిస్తున్న గోదావరి తీర ప్రాంతం అంతా కూడా ఆద్యాత్మికత ఉట్టి పడుతోంది. పుష్కర కాలంలో భక్తులు పెద్ద సంఖ్యలో పవిత్ర స్నానాలు చేసి సమీపంలోని ఆలయాలను
సందర్శించుకునేందుకు ఆసక్తి చూపుతారు. నదిపై పుష్కరుడు ప్రవేశించిన సమయంలో ముక్కొటి దేవతలు కూడా సచంరిస్తారని పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా పుష్కర సమయంలో గతించిన తమ పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రధానాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. సాధారణంగా తమ కుటుంబంలోని మూడు తరాల వారి పేరిట తిథి కార్యాలు చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే పుష్కర నది తీరంలో మరణించిన తమ పూర్వీకులు, బంధువులతో పాటు హితులు, సన్నిహితులందరికీ కూడా పిండ
ప్రధానాలు చేసే ఆనవాయితీ కొనసాగుతోంది. మహిళలు మొంటెల వాయినాలు, నదికి చీరె, సారె సమర్పించేందుకు భక్తులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. 

ప్రాశస్త్యం…

తెలంగాణాలని 8 జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న గోదావరి తీరం అంతా కూడా అత్యంత చారిత్రాత్మకతను తనలో ఇముడ్చుకుంది. అరుదైన ఆలయాలకు నెలవైన ప్రాంతంగా భాసిల్లుతున్న
గోదావరి తీరం అంతా కూడా పవిత్రతో ఉట్టిపడుతోంది. నిర్మల్ జిల్లా బాసరలో జ్ఞాన సరస్వతి, జగిత్యాల జిల్లా ధర్మపురిలో నృసింహ స్వామి, పెద్దపల్లి జిల్లా మంథనిలో గౌతమేశ్వర స్వామి, మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలో ఉత్తరవాహినిగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో త్రిలింగం, పలిమెల మండలం దమ్మూరులో త్రివేణి సంగమం, భద్రాద్రి జిల్లాలో రామాలయం ఇలా ఎన్నో చారిత్రాత్మక నేపథ్యంతో కూడుకున్న ప్రాంతంగా తెలంగాణలోని గోదావరి తీరమంతా భాసిల్లుతోంది. పొరుగునే ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాలలో కూడా అత్యంత చారిత్రాత్మక నేపథ్యం కల్గిన ప్రాంతాలు ఉండడం మరో ప్రత్యేకతను సంతరించుకుంది.

2027 pushkaraluCabinet Sub-Committeegodavari pushkaralutelangana newsTG NEWS
Comments (0)
Add Comment