దిశ దశ, జగిత్యాల:
పక్కింటోని సంసారంలో చిచ్చు పెట్టకు… స్పీకర్ నిర్ణయం తరువాత అయినా బుద్ది తెచ్చుకో… జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ఉద్దేశించి మాజీ టి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని స్పీకర్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని అన్నారు. దొంగ బుద్ది ఎందుకు..? స్పీకర్ నిర్ణయంతోనైనా సక్రమంగా ఉండాలని, తన కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టవద్దన్నారు. నా పార్టీ అంతర్గత విషయాల్లో ఎందుకు వేలు పెడుతున్నావని ప్రశ్నించారు. అభివృద్ది అంటే పక్కింటిపై కన్ను వేయడమా..? బిల్లుల కోసం తాపత్రయపడుతున్నాడని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డితో ఉండి గడిచిన రెండేళ్లలో జగిత్యాలలో ఏమి అభివృద్ది చేశావో చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ది అంతా కూడా రోటీన్ లో భాగమేనని వెల్లడించిన జీవన్ రెడ్డి, రెండేళ్లలో యావర్ రోడ్డు వెడల్పు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు.