ఇంటింటికి తిరిగి సేకరణ
దిశ దశ, గోదావరిఖని:
ద్విచక్ర వాహనానికి రెండు ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుని ఇంటింటికి వెల్లి చెత్త సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను కోసం సేకరిస్తున్నారు. ఇదేంటీ ఆ బల్దియాలో ఆటోలు కాకుండా ద్విచక్ర వాహనాలు ఏర్పాటు చేశారా అని డౌట్ పడకండి. ఆ వాహనంపై ఇంటింటికి వెల్లుతూ చెత్త సేకరిస్తున్నది శానిటేషన్ సిబ్బంది కూడా కాదు… ఆమె మాజీ కార్పొరేటర్.
ఎందుకంటె..?
పెద్దపల్లి రామగుండం కార్పోరేషన్ పరిధిలోని 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నాగనూరి సుమలత వినయంగా నిరసన తెలిపారు. తమ డివిజన్ లోని నివాస స్థలాల నుడి బల్దియా సిబ్బంది చెత్త సేకరించేందుకు రావడం లేదని, అధికారులు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేస్తున్నారు. చివరకు తానే చెత్త సేకరించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం వరకు వివిధ కాలనీల్లో తిరుగుతూ చెత్త సేకరించడం మొదలు పెట్టారు. శానిటేషన్ కంపెనీ తమ కాలనీ వైపు రావడం లేదని తానే చెత్త సేకరించి నిరసన వ్యక్తం చేస్తున్నానని సుమలత మీడియాకు వివరించారు. అదికార పార్టీ నేతలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. రోజుకో పద్దతిన నిరసన చెప్తానని స్పష్టం చేశారు. బల్దియా అధికార యంత్రాంగం స్పందించే వరకు కూడా తన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. చెత్త సేకరించే వారు కనిపించడం లేదని ప్రచారం చేస్తానన్నారు. అధికార పార్టీ వారికే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని సుమలత అన్నారు .