కవిత రాజీనామా ఆమోదం…

దిశ దశ, నిజామాబాద్:

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను  శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈమేరకు లెజిస్లేటివ్ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. 2021లో నిజామాబాద్ సంస్థల స్థానం నుండి పోటీ చేసి గెలిచిన కవిత బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి గత సంవత్సరం సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు. సోమవారం మండలి సమావేశానికి హాజరైన కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై ఘాటైన విమర్శలు చేసి తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ ను అభ్యర్థించారు. రాజీనామా విషయంలో పునరాలోచించుకోవాలని మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి సూచించారు. మంగళవారం కవిత రాజీనామాను ఆమోదిస్తూ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.

KALVAKUNTLA KAVITHALatest NewsMLC KAVITHAnizmamabadtelangana jagruthi