జానీ మాస్టర్ అరెస్ట్… గోవాలో అదుపులోకి

దిశ దశ, హైదరాబాద్:

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను వేధింపులకు గురి చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ షేక్ జానీ అలియాస్ జానీ మాస్టార్ ను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ ( SOT) అదుపులోకి తీసుకుంది. ఐదు రోజులుగా దొరకకుండా తిరుగుతున్న ఆయనను కొద్ది సేపటి క్రితం గోవాలో  ఎస్ఓటీ బృందం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. లద్దాక్, నెల్లూరు, గోవాతో పాటు పలు ప్రాంతాల్లో జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. చివరకు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చిన తరువాత కోర్టులో హజరు పరిచే అవకాశాలు ఉన్నాయి.

jani MasterLatest NewsTOLLYWOOD