ఓటర్ల చైతన్యంపై కార్టూనిస్టుల దృష్టి…

దిశ దశ, కరీంనగర్:

ఓటర్లను చైతన్య పర్చడంలో మేము సైతం అంటున్నారు కార్టూనిస్టులు. ఐదేళ్ల పాటు ప్రజా ప్రతినిధులుగా ఎంపిక చేసుకునే విషయంలో నాయకుల వలలో చిక్కుకోకుండా ముందుకు సాగాలని పిలుపునిస్తున్నారు. నవచైతన్యంతో ఓటు హక్కు వినియోగించుకుని అభివృద్దికి పట్టం కట్టే నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప డబ్బులకు ఓటు అమ్మకున్నట్టయితే అన్నింటా నష్టపోతామని తమ కళాత్మకతతో వివరిస్తున్నారు. కమర్షియల్ అవసరాల కోసమే కార్టూన్లు వేయడం కాదని సమాజ హితంలో తమ వంతు బాధ్యత నిర్వర్తించాలన్న సంకల్పంతో కార్టూనిస్టులు వేసిన కార్టూన్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రమైన ఓటుతో అవినీతి పరులకు బుద్ది చెప్పాలని పిలుపునిస్తున్నారు పలువురు కార్టూనిస్టులు. పోలింగులో పాల్గొనేందుకు నిరాసక్తత చూపుతున్న నేటితరం ఓటు హక్కు వినియోగించుకోవల్సి అవశ్యకత, నాటి తరం దిక్సూచిగా సాగుతున్న తీరును వివరిస్తూ కార్టూన్లు వేశారు. నిరుపేద కూడా డబ్బుకు అమ్ముడు పోకుండా నాయకులు ఇచ్చే తాయిలాలకు తలొగ్గిదే లేదని స్పష్టం చేస్తున్న కార్టూన్లను ప్రదర్శిస్తున్నారు. ప్రలోభాల పర్వంలో చిక్కుకోకుండా అత్యంత విలువైన ఓటు అస్త్రంతో ఓటరు తీర్పునివ్వాలంటూ కార్టూనిస్టులు వేసిన కొన్ని కార్టూన్లు మీ కోసం…

 

2026 electionsCartoonsELECTIONSmuncipal electionsVoter awareness
Comments (0)
Add Comment