అడిషనల్ కలెక్టర్ అవినీతి… అరెస్ట్ చేసిన ఏసీబీ…

దిశ దశ, వరంగల్:

సీసీ కెమెరాలు లేకుండా జాగ్రత్త పడి… సబార్డినేట్ ఉద్యోగుల ద్వారా అవినీతి సొమ్ము తీసుకున్నా వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఏసీబీ ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఇంఛార్జి జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అడిషనల్ కలెక్టర్, మరో ఇద్దరు ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… హన్మకొండలోని కొత్తూర్ జెండా ప్రాంతంలోని క్రియేటివ్ మోడల్ స్కూల్ రికగ్నైజేషన్ రెన్యూవల్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఘటన సంచలనంగా మారింది. స్కూల్ యజమానిని గుర్తింపు పునరుద్దరణ చేసేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగా ఎంఈఓ ఆమోదం తెలిపినప్పటికీ ఫైల్ క్లియర్ కాలేదు. దీంతో డీఈఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ మొహ్మద్ గౌజ్ ను కలవగా మొదట రూ. లక్ష ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ డిమాండ్ చేశారు. అయితే తాను అంత మొత్తంలో ఇచ్చుకోలేనని, తగ్గించాలని యజమాని నేరుగా హన్మకొండ అడిషనల్ కలెక్రట్ ఎర్రమడా వెంకటర్ రెడ్డిని కలిసి వేడుకున్నాడు. రెండు రోజులు అయినా రెన్యూవల్ ఫైల్ కు మోక్షం కలగకపోవడంతో మళ్లీ అడిషనల్ కలెక్టర్ ను కలిసి ఇంకా తగ్గించాలని కోరాడు. అక్కడే ఉన్న సీనియర్ అసిస్టెంట్ తో మంతనాలు జరేపేందుకు స్కూల్ యజమానినిని బయటకు పంపారు. చివరకు రూ. 60 వేలు ఇవ్వాల్సిందేనని మొహమ్మద్ గౌస్ ద్వారా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి చెప్పించారు. దీంతో శుక్రవారం క్రియేటివ్ మోడల్ స్కూల్ యజమాని డీఈఓ కార్యాలయానికి వెళ్లినప్పుడు సీనియర్ అసిస్టెంట్ మొహమ్మద్ గౌస్ అందుబాటులో లేకపోవడంతో జూనియర్ అసిస్టెంట్ కన్నెబోయిన మనోజ్ ను కలిశాడు. మనోజ్ అడిషనల్ కలెక్టర్ వెంకట రెడ్డిని కలిసి వివరించంగా రూ. 60 వేలు తీసుకోవాలని చెప్పారు.

సీసీ కెమెరాలు లేకుండా…

అయితే డీఈఓ ఆఫీసు జూనియర్ అసిస్టెంట్ కన్నెబోయిన మనోజ్ స్కూల్ యజమాని వద్ద లంచం తీసుకునేందుకు కలెక్టరేట్ భవనం క ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకుండా ఉన్న చోటకు వెళ్లి రూ. 60 వేలు తీసుకున్నాడు. అయితే క్రియేటివ్ మోడల్ స్కూల్ యజమాని ఏసీబీ అధికారులకు అప్పటికే ఫిర్యాదు చేయడంతో వరంగల్ ఏసీబీ అధికారులు మనోజ్ ను రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. అతనితో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌస్, అడిషనల్ కలెక్టర్, ఇంఛార్జి డీఈఓ ఎర్రమాడ వెంకట్ రెడ్డిలను అరెస్ట్ చేశారు.

ACB RAIDSACB TELANGANAACB TrapTELANGANA ACBwarangal