నిమ్మ భరత్ పై చర్యలు తీసుకోండి: కొప్పుల ఈశ్వర్ ఫిర్యాదు

దిశ దశ, రామగుండం:

పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై ఆరోపణలు చేసిన నిమ్మ భరత్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామగుండం కమిషనర్ కు కొప్పుల ఈశ్వర్ కంప్లైట్ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు. తనకు వాట్సప్ మెసెజ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ఆయన పని చేశాడని రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించారు. భరత్ కు తనకు ఎలాంటి సబంధం లేదని, అతను తనకు ఎలాంటి పని చేయలేదని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తన రాజకీయ శత్రువులతో కుమ్మక్కై బదనాం చేయడానికే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈ మేరకు భరత్ ఛాటింగ్ వివరాలకు సంబంధించిన పెన్ డ్రైవ్ కూడా అందిస్తున్నానని పేర్కొన్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొప్పుల ఈశ్వర్ ఆ పిర్యాదులో అభ్యర్థించారు. సోషల్ మీడియాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన ఫిర్యాదు కాపీ వైరల్ అవుతోంది.

2024 ElectionsKoppula Eshwarmp electionsPeddapalliramagundam