కాంగ్రెస్ పార్టీ లోకసభ ఇంఛార్జీలు వీరే…

దిశ దశ, హైదరాబాద్:

లోకసభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పీసీసీ సమాయత్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలవాలన్న లక్ష్యంతో పీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని 17 లెకసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలాన్ని చేతల్లో చూపించాలని భావిస్తున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయించాలన్న ప్రతిపాదన కూడా పీఏసీ చేసిన సంగతి తెలిసిందే. 17 లోకసభ స్థానలకు ఇంఛార్జీలను కూడా నియమించింది. ఆదిలాబాద్ కు దనసరి అనసూర్య సీతక్క, పెద్దపల్లికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ కు టి జీవన్ రెడ్డి, జహిరాబాద్ పి సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర రాజనర్సింహ, మల్కాజిగిరి తుమ్మల నాగేశ్వర్ రావు, సికింద్రాబాద్, హైదరాబాద్ లకు మల్లు భట్టి విక్రమార్క, చేవెళ్ల, మహబూబ్ నగర్ లకు ఏ రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వరంగల్ కొండ సురేఖ, మహబూబాబాద్, ఖమ్మంలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను ఇంఛార్జీలను నియమిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది.

cm revanth reddyCONGRESS PARTYIncharges of Lok Sabhatpcctpcc chief
Comments (0)
Add Comment