సీఎం పీఆర్వోల నియామకం… ఎల్లారెడ్డి పేట వాసి ‘బొల్గం’కు అవకాశం

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లుగా మరో ఇద్దరి నియామక ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేసిన ప్రభుత్వం పీఆర్వోలుగా బొల్గం శ్రీనివాస్, శ్రీధర్ మామిడాలను నియమించింది.

ఎల్లారెడ్డిపేట టు సీఎంఓ...

సీఎం పీఆర్వోగా నియామకం అయిన బొల్గం శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ స్వగ్రామం. 1996లో ఈనాడు రిపోర్టర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఈనాడు జర్నలిజం స్కూల్ కు ఎంపికయి సూర్యపేట, ఖమ్మం, అనంతపూర్ జిల్లాల్లో పని చేశారు. ఆ తరువాత సాక్షి దినపత్రిక కరీంనగర్, వరంగల్ జిల్లాల బ్యూరోగా పనిచేసిన శ్రీనివాస్ స్టేట్ బ్యూరోలో పలు ప్రభుత్వ శాఖల వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం వెలుగు దిన పత్రిక బ్యూరో చీఫ్ గా ఉన్న ఆయన ముఖ్యమంత్రి పీఆర్వోగా నియామకం అయ్యారు. గ్రామీణ ప్రాంతం నుండి సీఎంఓ పీఆర్వోగా ఎదిగిన శ్రీనివాస్ వైవిద్యమైన జర్నలిస్టుగా గుర్తింపు పొందారు. ఆయన పనిచేసిన చోట తన మార్కు రిపోర్టింగ్ చేస్తూ తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు.

BOLGAM SRINIVASbreaking newsCM PROcm revanth rddytelangana news
Comments (0)
Add Comment