కేసీఆర్ ను పరామార్శించిన జగన్

దిశ దశ, హైదరాబాద్:

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామార్శించారు. ఇటీవల ఫామ్ హౌజ్ లో కిందపడడంతో తొంటి సంబధిత సమస్య ఏర్పడడంతో సర్జరీ అయిన సంగతి తెలిసిందే. కొద్ది కాలం పాటు కేసీఆర్ రెస్ట్ తీసుకోవాల్సి ఉందని వైద్యులు సూచించడంతో నందినగర్ లోని ఆయన సొంత ఇంటికి తరలించారు. ప్రస్తుతం  బెడ్ రెస్ట్ లో ఉన్న కేసీఆర్ కోలుకోవడానికి మరో నాలుగు వారాలు పట్టే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ తనయడు, మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గురువారం హైదరాబాద్ కు ప్రత్యేకంగా వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసీఆర్ ను కలిసి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం ఆకాంక్షించారు.

ap cm jaganap newsbreaking newskcr newstelangana news
Comments (0)
Add Comment