బాలయ్యపై నాగచైతన్య ఆగ్రహం.. చిచ్చు రేపుతోన్న అక్కినేని-నందమూరి ఫ్యామిలీ వార్

అక్కినేని-నందమూరి వారసుల మధ్య టాలీవుడ్‌లో రచ్చ జరుగుతోంది. అక్కినేని, నందమూరి ఫ్యామిలీ మధ్య వార్ నడుస్తోంది. వీరసింహారెడ్డి సక్సెస్‌మీట్‌లో అక్కినేనిపై బాలయ్య చేసిన కామెంట్స్ దుమారం రేపుతోన్నాయి. అక్కనేని, తొక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలయ్య వ్యాఖ్యలపై హీరోలు అక్కినేని నాగచైతన్య, అఖిల్ ఘాటు రియాక్షన్ ఇచ్చారు. ఈ మేరకు వారిద్దరూ బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ ని అవమానించడమంటే మనల్ని మనం కించపరుచుకోవడమే అని నాగచైతన్య తెలిపాడు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు అని, వారిని అగౌవపరచడమంటే మనల్ని మనం కించపరుచుకోవడమేనని చెప్పారు. అయితే బాలయ్య చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలయ్య క్షమాపణలు చెప్పాలని అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తోన్నారు. ఈ మేరకు అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ బాలయ్యను హెచ్చరిస్తూ లేఖ విడుదల చేసింది.

అక్కినేని నాగేశ్వరరావును కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, బాలయ్య అసభ్యకర పదజాలంతో స్టేజ్ మీద మాట్లాడటం తన అహంకారపూరిత అవలక్షణంగా భావించాల్సి వస్తుందని లేఖలో తెలిపారు. బాలయ్య అహంకార మాటలను ఖండిస్తున్నామని, మీ నాన్నకు అన్యాయం చేసి అధికారం లాక్కుంటే, మీ నాన్న మాటల్లో ఆ నీచుడిని చంపి నా దగ్గరకి రా బాలయ్య అంటూ ఆ రోజు మీ నాన్న నీకు చెప్తే.. ఈ రోజుకు ఒక కొడుకుగా నెరవేర్చలేని నీ హీరోయిజం ఏ మాత్రానికి అంటూ మేము ప్రశ్నించవచ్చు అంటూ ఘాటు రియాక్షన్ ఇచ్చారు.

అక్కినేని ఫ్యాన్స్‌కు సంస్కారం ఉందని, బాలయ్య క్షమాపణలు చెప్పకపోతే తాము చేసే పనులకు బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని చెన్నై నుంచి హైదరాబాద్ కు నాగేశ్వరరావు తీసుకొచ్చారని, తన నటన, సేవాభావంతో ఎంతోమంది ఆర్టిస్ట్ లకు అవకాశాలు కల్పిస్తూ ఎంతో ఉన్నతస్థాయికి చేర్చాలని అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. బాలయ్య క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

akkineniap newsNandamuriNBKtelangana news