Telangana ACB: కోటపల్లిలో ఏసీబీ ట్రాప్…

దిశ దశ, చెన్నూరు:

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. జిల్లాలోని కోటపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్, తండ్రికి బదులుగా అటెండర్ గా పని చేస్తున్న మరోకరు రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. పాసు పుస్తకంలో సవరణలు చేసేందుకు లంచం డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కెమికల్ టెస్టుల్లో నిర్దారణ అయినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియ రావల్సి ఉంది. 

ACB RAIDSACB searchesACB TELANGANAflash newsTELANGANA ACB