రాజన్న ఆలయంలో ఏసీబీ సోదాలు…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం ప్రారంభమైన ఈ సోదాల్లో తూనికలు కొలతల శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఏసీబీ కరీంనగర్ రేంజ్ డీఎస్పీ రమణ మూర్తి నేతృత్వంలో సీఐలు తిరుపతి, కృష్ణ కుమార్ ల ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి. ఆలయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆహార పదార్థాలకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తుండడంతో పాటు తూనికలు కొలతల శాఖ అధికారులచే కూడా తనిఖీలు చేయిస్తున్నారు.

acbACB RAIDSACB TELANGANALatest Newsrajanna siricillavemulawada