ఆర్టీవో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలోని వివిధ ఆర్టీవో కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ, బండ్లగూడా, నాగోల్, మలక్ పేట్, ఖైరతాబాద్, షేక్ పేట్, ఆర్టీవో కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. అలాగే రాష్ట్రంలోని కరీంనగర్ తో పాటు పలు జిల్లాల్లోని ఆర్టీఓ కార్యాలయాల్లో ఏసీబీ ప్రత్యేక బృందాలు దాడులు చేస్తున్నాయి. ఈ సందర్భంగా పదు చోట్ల ఏజెంట్లు, బ్రోకర్లను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. అయితే ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.


 

 

acbACB RAIDSbreaking newsLatest NewsRto office