Telangana: బార్ కౌన్సిల్ జాబితా నుండి పలువురి తొలగింపు…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది మందిని కౌన్సిల్ నుండి తొలగిస్తూ జూన్ 28న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. బార్ కౌన్సిల్ రూల్ 42 ప్రకారం వీరందరిని తొలగిస్తున్నట్టుగా కార్యదర్శి వి నాగలక్ష్మి వెల్లడించారు. వీరిలో ఎనిమిది మంది బార్ కౌన్సిల్ లో సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని, ఆయా విశ్వ విద్యాలయాల నుండి జారీ చేయనట్టుగా నివేదికలు అందగా, మరోకరు వాస్తవాలను బార్ కౌన్సిల్ దృష్టికి తీసుక రాలేదన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. తెలంగాణ బార్ కౌన్సిల్ కార్యదర్శి వి నాగలక్ష్మీ ఈ మేరకు  మీడియాకు లేఖ విడుల చేశారు. ఈ జాబితాలో నిజామాబాద్ కు చెందిన ఏ శ్రవణ్ కుమార్, హైదరాబాద్ నాగోల్ కు చెందిన ఎం సురేఖ రమణి, దోమలగూడకు చెందిన ఎన్ విద్యా సాగర్, జవహర్ నగర్ కు చెందిన పి సిసిల్ లివింగ్స్టన్, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సతీష్ కనకంట్ల, హైదరాబాద్ హిమాయత్ నగర్ కు చెందిన నరేష్ సుంకర, మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మణికంఠనగర్ కు చెందిన రాజశేఖర్ చిలుక, సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీశైలం కె, అమీర్ పేటకు చెందిన ఎ ఉదయ్ కిరణ్ ల ఈ బాబితాలో ఉన్నట్టు నాగలక్ష్మీ వివరించారు.

Bar Councilflash newsLatest NewsTelangana Bar Counciltelangana news