దిశ దశ, కరీంనగర్:
నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంలో రాజీ లేకుండా ముందుకు సాగుతున్న అల్ఫోర్స్ విద్యా సంస్థలు మరోసారి సంచలన ఫలితాలను అందుకున్నాయి. విద్యార్థి దశలో అత్యంత కీలకమైన ఇంటర్ విద్య విషయంలో యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. అటు విద్యారంగం… ఇటు మానవతా విలువలను నేర్పించే విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్న అల్ఫోర్స్ మరోసారి తన సక్సెస్ ను చాటుకుంది. నైతిక విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు సామాజిక అంశాలపై తమ విద్యార్థులకు పరిపూర్ణమైన అవగాహన కల్పించడంలో కూడా తమ వంతు కృషి చేస్తున్నామని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అన్నారు. ఇంటర్ ఫలితాల ప్రకటన తరువాత మెరిట్ సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులను పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా సంస్కృతి, సంప్రాదాయల విషయంలోనూ తీర్చిదిద్దుతున్న ఘనత తమ విద్యా సంస్థలకే దక్కుతుందన్నారు. అత్యున్నతమైన విద్యనందించడం ద్వారా సంచలనాత్మక విజయాలను అందుకోవడం సాధ్యమేనని మరోసారి నిరూపించామని నరేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. తాజాగా విడుదల అయిన ఇంటర్ ఫలితాలే కాకుండా ఐఐటీ మెయిన్స్ ఫలితాల్లోనూ తమ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబర్చారని, రానున్న నీట్, ఎంసెట్ ఫలితాల్లో కూడా అఖండ విజయాలను నమోదు చేసుకుంటామని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ప్రకటించారు. ఇంటర్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను సాధించిన విద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ ను కూడా ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి అభినందించారు.
మెరిట్ స్టూడెంట్స్ వివరాలివే…
రాష్ట్రస్థాయి అత్యుత్తమమైన మార్కులతో ఇంటర్ ప్రథమ, ద్వీతీయ సంవత్సర ఫలితాల్లో అన్ని విభాగాల్లోనూ “అల్ఫోర్స్” జయకేతనం
ఎగురవేసింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలలో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ మార్కులను సాధించారు. సీనియర్ ఇంటర్మీడియట్ Bi.P.C. విభాగంలో 1000 మార్కులకు జె. అంజనా 997 మార్కులు సాధించి రాష్ట్రములో అగ్రగామిగా నిలిచారు. మొత్తం 11 మంది విద్యార్థులు 990కి పైగా మార్కులు సాధించారు. M.P.C. విభాగంలో 1000 మార్కులకు కె రుత్విక్ 996 రాష్ట్రములో అత్యున్నత స్థానంలో నిలవగా, పి శ్రీనిత్య రెడ్డి 995 యమ్. రుత్విక 995, ఎ లక్ష్మీ ప్రసన్న 995, ఎస్ సేవిత 994, వి ఋషికేష్ 994, యమ్ అక్షత 994, వి సాహితి 994, ఎస్ కార్తికేయ 994, జి. లక్ష్మి ప్రసన్న 994, కె వర్షిణి 994, యమ్. కీర్తి 994 మార్కులు సాధించడం విశేషం. 128 మంది విద్యార్థులు 990లకు పైగా మార్కులు సాధించి అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆణిముత్యాలుగా నిలిచారు. 900లకు పైగా మార్కులు 293 మంది విద్యార్థులు సాధించడం గమనార్హం. M.E.C. విభాగంలో 1000 మార్కులకు వి అక్షయ్వర్థన్ 988, వి రిషీత 988, మార్కులు సాధించారు. C.E.C. విభాగంలోను 1000 మార్కులకు బి గ్రీష్మా 987 మార్కులు సాధించగా, జూనియర్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో M.P.C. విభాగంలో 470 మార్కులకు ఎస్ లహరి 468, హప్సహస్నాన్ 468, తహూరా నూర్ 468, టి అన్విత రెడ్డి 468, సి హెచ్ అమతౌరాజ్ 468, పి కిర్తిశ్రీ 468, జె ప్రసూనాశ్రీ 468 ఎన్ క్రిష్ణవేణి 468, జి తరుణ్ 468, డి నాగాసాగర్ 468, జె ప్రణవ్జ 468, జి సూర్యప్రకాశ్ 468, ఎ శశివర్థన్ రెడ్డి 468, ఎల్ హాసిని 468, యమ్ శ్వేత 468, కె. పల్లవి 468, కె అనుపమ 468, ఏ నిచిత 468, జి తరుణ్ 468 జి లక్ష్మి ప్రియ 468, మొత్తం 20 మంది విద్యార్థులు 468 మార్కులు సాధించి అత్యుత్తమమైన ప్రతిభ కనబర్చారు. 66 మంది విద్యార్థులు 467 మార్కులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేశారు. Bi.P.C. విభాగంలో 440 మార్కులకు నభిలా తరీమ్ 438, జోహ మహవీష్ 438, సామా పిరదోష్ 438 మార్కులు సాధించారు. 10 మంది విద్యార్థులు 437కు పైగా మార్కులు సాధించారు. M.E.C. విభాగంలో 500 మార్కులకు గాను ఆర్. చిద్విలాస 491, మార్కులు, మరియు C.E.C. విభాగంలో 500 మార్కులకు గాను పి భవజ్ఞ 493 మార్కులు సాధించారు.