కొత్తపల్లి స్టేషన్ కేసు…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి స్టేషన్ లో నమోదైన కేసులో అఘౌరీ శ్రీనివాస్ ను కోర్టులో హాజరు పరిచారు. ఇటీవల ఎల్లారి శ్రీనివాస్ అలియాస్ అఘౌరీ శ్రీనివాస్ ను మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. ఇదే సమయంలో కొత్తపల్లి పోలీసు స్టేషన్ లో ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 2024 నవంబర్21న బాధితురాలిని ట్రాప్ చేసి కిడ్నాప్ కు పాల్పడ్డ శ్రీనివాస్ ఆ తరువాత కొండగట్టు ఆలయంలో ఆమె మెడలో పవిత్ర దారం కట్టారని కేసు నమోదు అయింది. దీంతో శ్రీనివాస్ పై క్రైం నంబర్ 201/2025, సెక్షన్ 64 (1), 87, 318 (4), 351 (2), BNS యాక్టులలో కేసు నమోదైంది. ఈ కేసులో శ్రీనివాస్ ను గురువారం కరీంనగర్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. అనంతరం హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించారు.

