Telangana Acb: రూ. 5 వేల కోసం కక్కుర్తిపడి… ఏసీబీ అధికారులకు చిక్కి…

దిశ దశ, పెద్దపల్లి:

ఇంటి నంబర్ కెటాయించేందుకు రూ. 5 వేల కోసం కక్కుర్తి పడ్డ ఇద్దరు మునిసిపల్ ఉద్యోగులు ఏసీబీకి రెడ్ హైండెడ్ గా పట్టుబడ్డారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకోవడంతో ట్రాప్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో కొంతకాలం ఇంటిని నిర్మించుకున్నాడు. అతని ఇంటికి నంబర్ కెటాయించాలని మునిసిపల్ అధికారులను వేడుకున్నాడు. అయితే రూ. 10 వేలు లంచం ఇస్తేనే ఇంటి నంబర్ కెటాయిస్తామని తేల్చి చెప్పడంతో బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శనివారం సుల్తానాబాద్ పట్టణంలోని దుకాణంలో రూ. 5 వేలు లంచం తీసుకుంటున్న మునిసిపల్ ఆర్ఐ వినోద్ కుమార్, ఔట్ సోర్సింగ్ బిల్ కలెక్టర్ విజయ్ లు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు.