పెద్దపల్లిలో సంచలనం…
దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ మునిసిపల్ ఏఈ సతీష్ ఏసీబీకి పట్టుబడ్డాడు. పట్టణంలోని ఆయన ఇంట్లో ఓ కాంట్రాక్ట్ పని బిల్ చేసే విషయంలో రూ. 2 లక్షలు తీసుకుంటుండగా కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. మంగళవారం తన ఇంట్లో కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. బాధితుడు ఏసీబీ అధికారులను కలిసి ఏఈ సతీష్ డిమాండ్ చేసిన విషయం గురించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి రెడ్ హైండెడ్ గా మునిసిపల్ ఏఈని పట్టుకున్నారు. లంచం తీసుకున్న ఏఈ సతీష్ కు ఫినాప్తలిన్ టెస్ట్ చేశారు. కాంట్రాక్ట్ వర్క్ కు సంబందించిన ఫైళ్లను పరిశీలించారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. నిందితుడిని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నామని వెల్లడించారు.


