Acb Trap: కార్యదర్శిని ట్రాప్ చేసిన ఏసీబీ….

దిశ దశ, గంగాధర:

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు పంచాయితీ కార్యదర్శి. రూ. 10 వేలు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. సంఘటనా వివరాల్లోకి వెలితే… కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ పంచాయితీ కార్యదర్శి అనిల్ ఇందిరమ్మ ఇంటి లబ్దిదారున్ని లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా శుక్రవారం రూ. 10 వేలు లంచం తీసుకుంటున్న కార్యదర్శి అనిల్ ను పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ లో నిర్దారణ కాగా, అధికారులు బాధితులు, ప్రత్యక్ష్య సాక్షుల నుండి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. అనంతరం కార్యదర్శి అనిల్ ను కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆద్వర్యంలో ఈ దాడులు జరిగాయి.