Telangana Acb: అకౌంట్స్ ఆఫీసర్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయి ఏసీబీ ట్రాప్…

ఆదిలాబాద్ మునిసిపల్ కార్యాలయంలో పట్టివేత…

దిశ దశ, ఆదిలాబాద్:

బిల్లు మంజూరు చేసేందుకు చేయి తడపాల్సిందేనని పట్టుబట్టిన అకౌంట్స్ ఆఫీసర్ ఏసీబీకి చిక్కాడు. అతనితో చేయి కలిపిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా కటకటాల లెక్కించబోతున్నాడు. సంఘటనా వివరాల్లోకి వెలితే… ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మునిసిపల్ పరిధిలో సీసీ రోడ్లు డ్రైనేజీల హైమాస్ లైట్ల ఏర్పాటుకు సంబంధించిన కాంట్రాక్టు పనులు చేసిన వ్యక్తికి రూ. 60 లక్షల వరకు బిల్లు రావల్సి ఉంది. ఇందులో రూ. 3.80 లక్షల పాక్షిక బిల్లు ఇప్పించేందుకు అకౌంట్స్ ఆఫీసర్ బట్టల రాజ్ కుమార్, ఔట్ సోర్సింగ్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న కొండ్ర రవి కుమార్ లు రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. రెండేళ్లుగా బిల్లుల కోసం నీరిక్షిస్తున్న సదరు కాంట్రాక్టర్ లంచం కోసం వేధింపులను తట్టుకోలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు నేతృత్వంలో సీఐ కిరణ్ రెడ్డి ఇతర ఏసీబీ సిబ్బంది గురువారం వీరిని రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. నిందితులకు కెమికల్ పరీక్షలు నిర్వహించగా ప్రూవ్ అయిందని ఏసీబీ అదికారులు తెలిపారు. వీరిని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో ప్రవేశ పెట్టనున్నామని వివరించారు.