కర్రెగుట్టల వద్ద పేలిన మందుపాతర…

జవాన్ కు గాయాలు…

దిశ దశ, ములుగు:

ములుగు జిల్లా పామునూరు కర్రెగుట్టల వద్ద మందుపాతర పేలడంతో ఓ జవాన్ కు తీవ్రగాయాలయ్యాయి. మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తిస్తున్న క్రమంలో ఒకటి పేలడంతో ఈ ఘటన జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు సమీపంలో శుక్రవారం మందుపాతరలను గుర్తించే పనిలో జవాన్లు నిమగ్నం అయ్యారు. 11 వరకు మందుపాతరలను గుర్లించి నిర్వీర్యం చేశారు. మరో మందుపాతర వెలికి తీస్తున్న క్రమంలో మందుపాతర పేలడంతో నవదీప్ పాఠక్ అనే జవాన్ గాయపడ్డారు. అతడిని హెలిక్యాప్టర్ ద్వారా వెంకటాపురం ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం 108 వాహనంలో వరంగల్ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు నిర్మాణం కోసం ఈ ప్రాంతంలో మందుపాతరలను వెలికి తీసి నిర్వీర్యం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే మందుపాతర పేలినట్టుగా అధికారవర్గాలు తెలిపాయి.