వీరవ్వ @ 105

దిశ దశ, హుజురాబాద్:

శతాధిక వృద్దురాలు ఓటేసి ఆదర్శ ప్రాయంగా నిలిచారు. 105 ఏళ్ల వయసులోనూ పోలింగ్ బూత్ వరకు నడుచుకుంటూ వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సైదాపూర్ మండలం పెరుకపల్లికి చెందిన మేడిశెట్టి  వీరవ్వ (105) బుధవారం జరిగిన పోలింగ్ లో పాల్గొన్నారు. ఓటేసేందుకు బద్దకిస్తున్న నేటి తరానికి భిన్నంగా శతాధిక వృద్దురాలు ప్రజా స్వామ్యంలో తనవంతు బాధ్యతగా ఓటు వేయడం పలువురిని అబ్బురపర్చింది.. సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రంగా నిలిచిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న నీరవ్వ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.