మీ రక్షణే మాకు శ్రీరామ రక్ష… పోడ్సా మల్టీపర్పస్ సొసైటీ నిర్వాహకుల ప్రచారం…

దిశ దశ, జాతీయం:

हमने यहाँ सब कुछ मैनेज कर लिया है… तेलंगाना से आने वाली किसी भी खबर से डरो मत। अगर आप पोडसा में पोकर खेलने आते हैं, तो हर तरह की सुरक्षा होगी। यह सुनिश्चित करना हमारी ज़िम्मेदारी है कि आपके ख़िलाफ़ कोई मामला दर्ज न हो। चंद्रपुर जिले के राजुरा तालुका के डाबा पुलिस थाना क्षेत्र के पोडसा में संचालित राजीव समाधान बहुउद्देशीय सोसायटी के आयोजक पोकर खिलाड़ियों को आश्वस्त कर रहे हैं।

మా ప్రాంతంలో అన్ని రకాలుగా మేనేజ్ చేసుకున్నాం. తెలంగాణ నుండి వచ్చే పేకాటరాయుళ్లు భయపడాల్సిన పని లేదు. అన్ని విధాలుగా రక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది, మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మాది. మీకు వ్యతిరేకంగా ఇక్కడ ఎలాంటి వ్యవహారాలకు తావు లేదు…  ఇది చంద్రపూర్ జిల్లా రాజూరా తాలుకా దాబా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోడ్సాలో నిర్వహిస్తున్న రాజీవ్ సమాదాన్ మల్టీపర్పస్ సొసైటీ ప్రతినిధులు తెలంగాణ జూదగాళ్లకు ఇస్తున్న భరోసా తీరు.

తెలంగాణ సరిహద్దులకు పట్టుమని పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పోడ్సాలో ఏర్పాటు చేసిన ఈ మల్టీపర్పస్ సొసైటీలో నిబంధనలకు విరుద్దంగా పేకాట సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికేతరులైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిచే పేకాట ఆడించేందుకు మాత్రమే ఇక్కడ క్లబ్ ఏర్పాటు చేశారని స్పష్టం అవుతోంది. రాజీవ్ సమాధాన్ మల్టీపర్పస్ సొసైటీ పేరిట ఏర్పాటు చేసిన ఈ క్లబ్ లో రిజిస్ట్రర్డ్ అయిన బాధ్యులు ఎవరు ఉన్నారో తెలియదు కానీ దశాబ్దాల కాలంగా విదర్భ ప్రాంతంలో పేకాట కేంద్రాలను నిర్వహించడంలో ఆరితేరి ఉన్న బడా బాబులు దీని వెనక ఉన్నారని ప్రచారం మాత్రం చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగంతో పాటు అన్ని వర్గాలను తమ గుప్పిట పెట్టుకున్నామని పేకాట ఆడేందుకు వచ్చే వారికి ఎలాంటి ధోఖా ఉండదని, ధీమాగా వచ్చి నిర్భయంగా గేమ్ ఆడి వెల్లిపోవచ్చన్న భరోసా ఇస్తున్న తీరు అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

సర్కారు దృష్టి ఏది..?

మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న జూదం కేంద్రాలపై గతంలో దాడులు చేయించిన సందర్భాలు ఉన్నాయి. వీటిని కట్టడి చేసేందుకు పోలీసు అధికారులు కూడా కఠినంగా వ్యవహరించారు. గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలో పలు చోట్ల క్లబ్ లను నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న జిల్లా అధికార యంత్రాంగం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సిరొంచ తాలుకాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ క్లబ్ లు అన్ని కూడా పోలీసు అధికారుల హెచ్చరికలతో మూతబడిపోయాయి. అయితే చంద్రపూర్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం పేకాట నిర్వహిస్తున్న మల్టీపర్పస్ సొసైటీలపై ఊదాసీనంగా వ్యవహరించడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ సొసైటీలో జూదం ఆడేందుకు అనుమతి ఉన్నప్పటికీ ఎన్ని టేబుళ్లకు అనుమతి ఇచ్చారు..? ఎన్ని టేబుళ్లు నడుస్తున్నాయి..? ఆర్థిక లావాదేవీల పరిమితి ఎంత..? అక్కడ బెల్ట్ షాపు ద్వారా లిక్కర్ విక్రయించేందుకు అనుమతి ఉందా..? ఫుడ్ సేఫ్టీ అథారిటీ అనుమతి తీసుకునే రెస్టారెంట్ నిర్వహిస్తున్నారా..? ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఈ సొసైటీలోకి అనుమతి ఉంటుందా..? ఉన్నట్టయితే సొసైటీ సభ్యులతో సంబంధం లేకుండానే వీరిని ఎలా అనుమతిస్తారన్న నిబంధనలు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విదర్భ ప్రాంతంలోని చంద్రపూర్, గడ్చిరోలి ప్రాంతానికి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాఖాలోనే నిబంధనలకు విరుద్దంగా మల్టీ పర్పస్ సొసైటీ నిర్వహిస్తుండడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

బాధితుల గగ్గోలు…

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఆందోళనకర పరిణామాలు నెలకొన్నాయి. సరిహధ్దుల్లో దర్జాగా పేకాట సాగుతుండడంతో ఇక్కడి పేకాట ప్రియులు అంతా కూడా మహారాష్ట్రలోని పోడ్సాకు వెల్లిపోతున్నారు. రోజూ జూదంలో డబ్బులు పొగొట్టుకుని వస్తున్న తీరుతో ఆయా కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబాన్ని పెంచి పోషించాల్సిన వారే జూదం కేంద్రాలకు వెల్లి లక్షల్లో డబ్బును నాశనం చేస్తుండడంతో తమ కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పేకాట కేంద్రాలు నడవడం లేదన్న సంతోషం కన్నా మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల్లో పేకాట కేంద్రాలను నిర్వహించుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇస్తున్న తీరు తమకు శాపంగా మారిందంటున్నారు. మాహారాష్ట్ర ప్రభుత్వం పేకాట కేంద్రాలపై కఠినంగా వ్యవహరించాలని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని అక్కడి మల్టీ పర్పస్ సొసైటీల్లోకి అనుమతిస్తున్న తీరుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సరిహద్దు జిల్లాలకు చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు.